Balayya-Koratala siva: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బాలకృష్ణ- కొరటాల శివ కాంబో ఫిక్స్

నందమూరి బాలకృష్ణతో పవర్ ఫుల్ మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుడు కొరటాల శివ(Balayya-Koratala siva).

nandamuri balakrishna next movie with director koratala siva

  • బాలకృష్ణతో మూవీ చేస్తున్న కొరటాల
  • సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసిన బాలయ్య
  • దేవర 2 స్థానంలో రానున్న క్రేజీ మూవీ

Balayya-Koratala siva: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెన్సేషనల్ కాంబో సెట్ అయ్యిందా అంటే అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Balayya-Koratala siva) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారైనట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క సిట్టింగ్‌లో కొరటాల చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయిన బాలయ్య, వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరి కలయిక కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పూనకాలు తెప్పించే వార్త అనే చెప్పాలి.

NtrNeel: ధురంధర్ చూశాకే ‘డ్రాగన్’ వాయిదా.. అలా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్దడంలో కొరటాల శివ టాప్ లో ఉన్నాడు. అలాంటి దర్శకుడు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో నందమూరి బాలకృష్ణ పాత్ర ఉండబోతోందని, క్యారెక్టరైజేషన్ పరంగా ఇది ‘నెవర్ బిఫోర్’ రేంజ్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న బాలయ్య బాబు కెరీర్‌లో ఈ సినిమా మరో ల్యాండ్‌మార్క్ ఫిలింగా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి సెన్సేషనల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.