NtrNeel: ధురంధర్ చూశాకే ‘డ్రాగన్’ వాయిదా.. అలా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
రిలీజ్ విషయంలో ధురంధర్ సినిమాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(NtrNeel) టీం.
ntr, prashanth neel dragon movie release date update
ధురంధర్ దారిలోనే ఎన్టీఆర్ ‘డ్రాగన్’
ఒకేసారి షూట్ గ్యాప్ లేకుండా రిలీజ్
హ్యాపీ ఫీలవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
NtrNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 జూన్ 11న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా మే 20న టీజర్ వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Samyuktha Menon: పెళ్లి చేసుకోబోతున్న సంయుక్త మీనన్.. రష్మిక లాగే తనుకూడా!
నిజానికి డ్రాగన్(NtrNeel) సినిమాను ముందుగా అనుకున్న దానికంటే దాదాపు ఒక ఏడాది పాటు వాయిదా వేశారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పోస్ట్పోన్మెంట్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమా తరహాలో, ‘డ్రాగన్’ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘ధురంధర్’ రెండు పార్ట్‌లను ఒకేసారి షూట్ చేసి అతి తక్కువ విరామంలో విడుదల చేసిన విధానం దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ఆకట్టుకుందట.
అందుకే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు సంబంధించి రెండు భాగాల షూటింగ్‌ను ఏకకాలంలో పూర్తి చేసి, వెంటవెంటనే రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనివల్ల సినిమా ఆలస్యమైనప్పటికీ, బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ చిత్రాలను చూసే అవకాశం దక్కుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ జానర్లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం నీల్ తనదైన శైలిలో భారీ సెట్టింగ్స్, ఎమోషన్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ డబుల్ ట్రీట్ వార్తతో సోషల్ మీడియాలో ‘డ్రాగన్’ మేనియా మరింత పెరిగింది.
