‘రూలర్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమిని

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..

  • Publish Date - October 16, 2019 / 09:24 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘NBK 105’ మూవీకి ‘రూలర్’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన బాలయ్య పోస్టర్స్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ కాగా, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..

‘రూలర్’ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడయిపోయాయి. ప్రముఖ ఎంటర్‌టైనర్‌మెంట్ ఛానెల్ జెమిని టివి ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కలయికలో రానున్న సినిమా కాబట్టి ‘రూలర్’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఫ్యాన్సీ రేటుకి జెమిని టివి ‘రూలర్’ హక్కులు సొంతం చేసుకుంది.

Read Also : ప్రభాస్ అన్న అలాంటి సినిమాలు చేస్తే కిరాక్ ఉంటది!

అక్టోబర్ 18 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సంక్రాంతికి విడుదల చేస్తామని, ‘జైసింహ’ కంటే పెద్ద మాస్ సినిమా బాలయ్య అభిమానులకు ఇస్తామని నిర్మాత చెప్పారు. కథ : పరుచూరి మురళి, మాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి.రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..