Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ బర్త్ డే.. ఫస్ట్ లుక్‌తో అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్..
నందమూరి కళ్యాణ్ పుట్టిన రోజు (Nandamuri Kalyan Ram) సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- July 5, 2026 / 12:30 PM IST
Nandamuri Kalyan Ram first look from VenkyAnil5 #NKRAR2 movie
Nandamuri Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేడు (జూలై 5). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఓ చిత్రంలో నటిస్తున్నారు. #VenkyAnil5 #NKRAR2 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు, మెడలో దండతో ఉన్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది.
Sneha : రెట్రో లుక్‌లో నటి స్నేహ.. అలనాటి హీరోయిన్లలా ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు
కళ్యాణ్ రామ్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా మొదటి హీరో, నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన కళ్యాణ్‌రామ్ కి హ్యాపీ బర్త్‌డే. డెబ్యూ డైరెక్టర్‌గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికి కృతజ్ఞుడిని. . #VenkyAnil5 #NKRAR2 మూవీలో మిమ్మల్ని ఓ సరికొత్తగా చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. 2027 సంక్రాంతిని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
కీర్తి సురేష్, కృతి శెట్టిలు కథానాయికలుగా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
