×
Ad

Nandamuri Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీపై సోషల్ మీడియాలో పోస్ట్.. అసలు ఇది మోక్షజ్ఞనేనా?

తాజాగా మోక్షజ్ఞ త్వరలో వస్తున్నట్టు ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.

  • Published On : July 2, 2024 / 08:08 AM IST

Nandamuri Mokshagna New Photo goes Viral Fans asked is it Mokshagna Really

Nandamuri Mokshagna : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు త్వరలో వస్తాడని చెప్తూనే ఉన్నాడు. ఇక మోక్షజ్ఞ ఎక్కడ కనిపించినా అతని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతాయి. ఇటీవల విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్ కి బాలకృష్ణ వస్తే అక్కడ కూడా మోక్షజ్ఞ త్వరలో వస్తున్నాడు అని చెప్పాడు. విశ్వక్ అయితే మోక్షజ్ఞ సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని తెలిపాడు.

Also Read : కన్నప్ప విడుదలపై మంచు విష్ణు భారీ ప్లాన్?

తాజాగా మోక్షజ్ఞ త్వరలో వస్తున్నట్టు ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ట్విట్టర్లో మోక్షజ్ఞ ఫ్యాన్ పేజీ ఒకటి మోక్షజ్ఞ, బాలకృష్ణ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ పేజీలో మోక్షజ్ఞ కొత్త లుక్ ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి వస్తున్నా.. అంటూ పోస్ట్ చేసారు. అయితే ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు ఆ ఫోటో సైడ్ వ్యూలో ఉండటంతో అసలు ఇతను మోక్షజ్ఞనేనా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది.

ఇక మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలయ్య బాబుని ప్రశాంత్ వర్మ అన్‌స్టాపబుల్ షో కోసం డైరెక్ట్ చేసాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు రాబోతున్నాయి. దీంతో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ద్వారా అయితే సేఫ్ గా ల్యాండ్ అవుతాడని బాలయ్య ఆలోచించినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో.