కన్నప్ప విడుదలపై మంచు విష్ణు భారీ ప్లాన్?

Kannappa: ఈ సమయంలోనే కన్నప్ప రిలీజ్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తోన్న మంచు విష్ణు మరో ప్లాన్‌ కూడా

కన్నప్ప విడుదలపై మంచు విష్ణు భారీ ప్లాన్?

కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మంచు విష్ణు భారీ స్కెచ్చే వేశారా? ఈ దసరాకు రిలీజ్‌ చేయాలనుకున్న కన్నప్ప సినిమా… ఇంకొంచెం ముందే విడుదల కానుందా? ఐదుగురు ప్రధాన హీరోలు, ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ కోసం మంచు విష్ణు ప్లానేంటి? ముఖ్యంగా టాలీవుడ్‌ టాప్‌ హీరో ప్రభాస్‌ను ఎలా వాడుకోవాలని భావిస్తున్నాడు? కల్కితో హిట్‌ కొట్టిన ప్రభాస్‌ వల్ల తన పంట పండిందని కన్నప్ప ఖుషీ అవుతున్నాడా?

మంచు ఫ్యామిలీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా కన్నప్ప. మహాశివుడి భక్తుడైన కన్నప్ప పాత్ర ఇతివృత్తంగా కన్నప్ప చిత్రీకరిస్తున్నారు… మహాభారతం టీవీ సీరియల్‌ రూపొందించిన ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్న కన్నప్ప సినిమాలో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళీ, హిందీ సినిమా రంగాలకు చెందిన టాప్‌ హీరోలు నటిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ టాప్‌ హీరో ప్రభాస్‌…. కన్నప్పలో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే కల్కి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌…. కన్నప్పలో కూడా నటించడం తమకు అడ్వాంటేజ్‌ అవుతుందని భావిస్తున్నాడు మంచి విష్ణు. కల్కి హిట్‌ ట్రాక్‌ కంటిన్యూ చేయాలంటే వెంటనే కన్నప్పను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట విష్ణు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా స్టార్ట్
ఈ ఆలోచనతోనే కన్నప్ప.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ప్రారంభించారని టాలీవుడ్‌ టాక్‌. ముఖ్యంగా పోస్టర్లలో ప్రభాస్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట నిర్మాతలు. బాహుబలి, కల్కి వంటి భారీ చిత్రాలతో ఆలిండియా లెవల్‌లో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్‌ పోస్టర్లను ఎక్కువగా ప్రచారం చేస్తే తమ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయమని అంచనా వేస్తోంది మంచు ఫ్యామిలీ. అదేవిధంగా ప్రస్తుతం పురాణ, ఇతిహాసాలను మోడరన్‌గా చూపించడం ట్రెండ్‌గా మారింది. ఈ ప్రయోగం కల్కిలో సక్సెస్‌ అయింది. దీంతో కన్నప్ప కూడా సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నారు.

కల్కి హవా నడుస్తున్న ఈ సమయంలోనే కన్నప్ప రిలీజ్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తోన్న మంచు విష్ణు మరో ప్లాన్‌ కూడా సిద్ధం చేశాడంటున్నారు. ఇప్పటికీ కన్నప్ప ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా, తాజాగా ప్రభాస్‌ను ప్రముఖంగా చూపి మరో ట్రైలర్‌ విడుదల చేయాలని చూస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌. అదేవిధంగా ప్రభాస్‌ పాత్రతో ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన సందర్భంలోనే రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్‌ టార్గెట్‌ పెట్టుకున్న కన్నప్ప కోసం మంచు విష్ణు చేస్తున్న ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Bharateeyudu 2 : క్యాలెండర్‌ సాంగ్ వ‌చ్చేసింది.. అందాల ఆర‌బోత‌