Anakapalli : బాబోయ్.. నందిని రాయ్ ఐటెం సాంగ్ చూశారా? లబ్బరు బొమ్మ అంటూ..

మీరు కూడా ఈ లబ్బరు బొమ్మ ఐటెం సాంగ్ వినేయండి.. (Anakapalli)

  • Published on- May 8, 2026 / 05:41 PM IST

Anakapalli

Anakapalli  భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యాంరస్ పై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్‌ సినిమా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట హీరో హీరోయిన్స్ గా నటించగా తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ, శ్రీనివాస్ వడ్లమాని, నందిని రాయ్, సంగీత.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ అనకాపల్లి సినిమా నుంచి మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘లబ్బరు బొమ్మ..’ అంటూ సాగిన ఈ పాటని దేవ్ జండ్ సంగీత దర్శకత్వంలో రాంబాబు గోశాల రాయగా శ్రీ కృష్ణ, సాహితీ చాగంటి పాడారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఈ పాటలో నందిని రాయ్, తారక్ పొన్నప్ప మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

Also Read : Megastar Chiranjeevi : పెద్ది సెట్స్ లో మెగాస్టార్, సుకుమార్.. కండలు చూపిస్తున్న చరణ్, బుచ్చి.. ఫోటోలు వైరల్..

మీరు కూడా ఈ లబ్బరు బొమ్మ ఐటెం సాంగ్ వినేయండి..