Nani 31 : నాని 31.. మళ్ళీ ఆ దర్శకుడితోనే.. కాకపోతే ఈ సారి..

నానితో 'అంటే సుందరానికి' లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా చేయనున్నట్టు సమాచారం.

Nani 31 movie with vivek athreya planning action movie

Vivek Athreya :  హీరో అంటే ఒకే ఇమేజ్ కి ఫిట్ అయిపోకూడదు. కొంతమంది అదే ఇమేజ్ ని కంటిన్యూ చేస్తుంటే కొంతమంది మాత్రం అలా ఇమేజ్ ని ఫిక్స్ చేసుకోకుండా అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తున్నారు. స్పెషల్లీ నాని(Nani) అయితే ఆల్ మోస్ట్ అన్ని రకాల సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన దసరా(Dasara)తో యాక్షన్ తో కూడా హిట్ కొట్టారు. అందుకే మరోసారి అదే యాక్షన్ కంటిన్యూ చేస్తానంటున్నాడు .

నాని లవర్ బాయ్ గా, పక్కింటి అబ్బాయి గా, కామెడీ జానర్ తో పాటు చాలా ట్రై చేశారు. ఆఖరికి విలనీ షేడ్స్ తో నెగెటివ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. కానీ దసరా వరకూ నాని యాక్షన్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. జెండాపై కపిరాజు, కృష్ఱార్జున యుద్దం, వి, టక్ జగదీష్ ఇలా ఏ యాక్షన్ మూవీ సక్సెస్ కాలేదు. కానీ దసరా నాని కి యాక్షన్ హిట్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్ళీ నాని 30వ ఇనిమా ఫ్యామిలీ, ఎమోషన్స్ లాంటి కథతో తెరకెక్కుతుండగా నాని 31వ సినిమా మరోసారి యాక్షన్ మూవీయే అని తెలుస్తుంది.

నానితో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా చేయనున్నట్టు సమాచారం. అంటే సుందరానికి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ప్రేక్షకుల మదిలో ఓ మంచి సినిమాలా నిలిచింది. ఈ సినిమాకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు.

Sharwanand Wedding : తాజాగా శర్వానంద్ షేర్ చేసిన మరిన్ని పెళ్లి ఫొటోలు..

ఇప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నాని 31వ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ సినిమా కాకుండా దసరా లాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ యాక్షన్ ఇమేజ్ ని మించి నాని తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్ ఆత్రేయ. ప్రస్తుతం శౌర్యువ్ తో నాని తన 30వ సినిమా చేస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ వీక్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చాక నాని వివేక్ ఆత్రేయతో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ మూవీ నానీకి దసరా లాంటి సాలిడ్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు