Nani
Nani : నాని త్వరలో ది పారడైజ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న నాని పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆయా షేర్ అనే పాటని రిలీజ్ చేసారు. ఇందులో నాని డ్యాన్స్ అదరగొట్టేసాడు. నాని మొదటిసారి ఈ రేంజ్ డ్యాన్స్ వేయడం అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సాంగ్ లో నాని వేసిన కొన్ని స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే నాని వేసిన స్టెప్స్ కాపీ అని, వాళ్ళు నా స్టెప్స్ కాపీ చేసారని బాబా జాక్సన్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, డ్యాన్సర్ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తాను గతంలో ఓ విదేశీయుడితో కలిసి చేసిన స్టెప్స్ షేర్ చేసి అవి ఒరిజినల్ అని, నాని వేసిన స్టెప్స్ కాపీ అని వీడియో పోస్ట్ చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
అయితే నువ్వే మైకేల్ జాక్సన్ ని కాపీ కొడుతున్నావని పలువురు నాని ఫ్యాన్స్ ఈ బాబా జాక్సన్ ని విమర్శిస్తుంటే మరికొంతమంది మాత్రం నిజమే స్టెప్స్ అచ్చు అలాగే ఉన్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ ని కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ కంపోజ్ చేసారు. మరి సుధన్ కానీ, మూవీ టీమ్ కానీ ఈ కాపీ కామెంట్స్ పై స్పందిస్తారేమో చూడాలి.