Shyam Singha Roy: డ్యూయెల్ రోల్.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదే!
నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో..
- Naresh Mannam
- Published On : November 21, 2021 / 06:57 PM IST
Shyam Singha Roy
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించనుండగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించగా భారీస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Sherry Agarwal: అందాల గాలమేస్తున్న షెర్రీ అగర్వాల్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టిన యూనిట్ డిసెంబర్ 24న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా నానీ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా మారనుందని ధీమాగా చెప్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి.. కథ ఇదేనని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ ఒకటి సాగుతుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ ముందుగానే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. కాగా.. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్ ను బట్టి విశ్లేషకులు కథ ఇదేనని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!
శ్యామ్ సింగరాయ్ సినిమా బెంగాల్ నేపథ్యంలో సాగే కథ కాగా ఒకప్పుడు కలకత్తాలో ఎక్కువగా ఉండే దేవదాసి వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకున్న పరిస్థితులను ఎదురించే హీరో పోరాటంగా ఈ సినిమా సాగనుందట. ఇందులో సాయిపల్లవి దేవదాసిగా నటిస్తున్నట్లు అంచనా వేస్తుండగా.. ఇందులో నాని జర్నలిస్టుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. కలకత్తాలో జరిగే దేవదాసి వ్యవస్థ ఆగడాలపై పోరాడే ఒక జర్నలిస్టు పాత్రలో ఒక నాని పాత్ర నటిస్తుండగా.. ఆ పాత్రతో నేటి నాని పాత్రను ముడిపెడుతూ కథా సాగుతుందని చెప్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే.
