Shriya Kontham : నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నానితో పాటు మొత్తం ఐదు జనరేషన్స్ కి సంబంధించిన అమ్మాయిలు ముఖ్య పాత్రల్లో నటించగా అందులో నానికి సిస్టర్ లాంటి పాత్రలో శ్రియ కొణతం అనే అమ్మాయి నటించింది.
ఆ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సింపుల్ గా కనిపించింది శ్రియ కొణతం. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది.
గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత శ్రియ కొణతం మళ్ళీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటున్నట్టు సమాచారం.
సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఇలా హాట్ ఫొటోలతో అలరిస్తుంది.
తాజాగా ఇలా ఓ లైబ్రరీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను శ్రియ కొణతం తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలు చూసి శ్రియ కొణతం హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో, హీరోయిన్ పాత్రలకు సరిపోద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.