Nani- Muralikanth- Naslen: నాని నిర్మాణంలో ‘ప్రేమలు’ హీరో.. ‘దండోరా’ దర్శకుడితో క్రేజీ ప్రాజెక్ట్
మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్న నేచురల్ స్టార్ నాని(Nani- Muralikanth- Naslen).
- V Santhosh Kumar
- Published On : March 31, 2026 / 04:35 PM IST
nani, naslen, muralikanth devasoth movie on cards
- టాలీవుడ్‌లో ‘ప్రేమలు’ నస్లీన్ ఎంట్రీ
- నాని- మురళికాంత్ దేవసోత్ కాంబో ఫిక్స్
- ప్రేమలు హీరోతో దండోరా డైరెక్టర్ మ్యాజిక్
Nani- Muralikanth- Naslen; ‘దండోరా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు మురళికాంత్ దేవసోత్. సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా పలు అవార్డులను సైతం గెలుచుకుంది. ఈ టాలెంటెడ్ దర్శకుడు మురళికాంత్ దేవసోత్ తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. వినూత్నమైన కథలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నేచురల్ స్టార్ నాని, ఈ క్రేజీ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Hebah Patel: క్యూట్ స్మైల్.. అదిరిపోయే పోజులు.. గోల్డెన్ శారీలో హెబ్బా పటేల్ హాట్ పిక్స్ వైరల్.
నాని(Nani- Muralikanth- Naslen) తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, మలయాళ సెన్సేషనల్ హిట్ ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నస్లీన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
నిజానికి, దర్శకుడు మురళికాంత్ తన మొదటి సినిమాతోనే ఒక బలమైన ముద్ర వేశారు. సామాజిక అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి అభిరుచి గల నిర్మాత తోడవడంతో, ఈ కాంబినేషన్ నుంచి మరో అద్భుతమైన సినిమా వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక హీరో నస్లీన్ కు తెలుగులో ఇది మంచి ఎంట్రీ అవుతుందని, ఆయన ఎనర్జీ ఈ కథకు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
