Nani – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ నాని వీడియో.. విప్లవాత్మక మార్పులు..

Nani Supports Pawan Kalyan: నాని ఏం మాట్లాడారో మీరు కూడా వినేయండి.. (Nani)

Nani Spoke About Pawan Kalyan And Ap Government Program

Nani-Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధికి, పచ్చదనం, పరిశుభ్రత కోసం ఎన్నో పనులు చేస్తున్నారు పవన్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గ్రామాల్లో స్వచ్ఛరథాలు అనే కార్యక్రమం మొదలుపెట్టారు.

మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అనే నినాదంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన స్వచ్ఛరథాలు, చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లేలా మరింత ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు టాలీవుడ్ హీరో నాని ని అడిగిన వెంటనే దీనిపై ఓ వీడియో చేసారు.

Also Read : Rain Alert in AP : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఐదు రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు

నాని ఈ కార్యక్రమంపై మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టిన స్వచ్ఛ రథాలు అనేది చాలా మంచి కార్యక్రమం అని చెప్తూ తడిచెత్త, పొడిచెత్త వేరుచేస్తూ, పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలి అంటూ ఏపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను అంటూ మాట్లాడి అవగాహన కల్పించారు. దీంతో నాని మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

ఏపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం గురించి నాని ఏం మాట్లాడారో మీరు కూడా వినేయండి..