Nani : ఆ థియేటర్లో ‘టక్కరి దొంగ’ సినిమాకి రచ్చ రచ్చ చేశాం.. ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం
నిన్న ఈ థియేటర్ కాలిపోవడంతో న్యాచురల్ స్టార్ నాని ఈ థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ.......
- Saketh U
- Published on- January 4, 2022 / 06:59 AM IST
Nani
Nani : నిన్న తెల్లవారుజామున హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. హైదరాబాద్ లోని బిగ్స్క్రీన్స్లో ఇది ఒకటి. అంతే కాక ఎన్నో సంవత్సరాలుగా ఉన్న థియేటర్, మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి.
Saara Alikhan : నాకు ఇల్లరికం వచ్చే భర్తే కావాలి: సారా అలీఖాన్
నిన్న ఈ థియేటర్ కాలిపోవడంతో న్యాచురల్ స్టార్ నాని ఈ థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తే. ఆ సినిమాకి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్ తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’’ అని నాని ట్వీట్ చేశాడు.
