×
Ad

Bloody Romeo: నాని- సుజీత్ మూవీ ‘బ్లడీ రోమియో’.. గ్యాంగ్ స్టరా, వంట మనిషా?

నాని, సుజీత్ మూవీ టైటిల్ అండ్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్(Bloody Romeo).

Nani,sujeeth new movie bloody romeo

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని హీరోగా ఓజీ దర్శకుడు సుజీత్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఓజీ సమయంలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. దానికి కారణం నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే. ఇక రీసెంట్ గానే ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలయ్యింది. ఇక నేడు అంటే ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో(Bloody Romeo)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక కాన్సెప్ట్ టీజర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. నాని ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ అండ్ చెఫ్ గా రెండు రకాల పాత్రల్లో కనిపించనున్నాడు అని అర్థం అవుతోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sravanthi Chokarapu: ఉస్తాద్ లుక్ లో యాంకర్ స్రవంతి.. పవన్ ఫ్యాన్ గా ఫుల్ జోష్ లో.. ఫోటోలు