Photo Credits : India Today
Nara Lokesh : సినీ సెలబ్రిటీలు సినిమాల గురించి రెగ్యులర్ గా మాట్లాడతారు. కానీ పొలిటీషియన్స్ సినిమాల గురించి చాలా రేర్ గా మాట్లాడతారు. మాట్లాడితే మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లెవ్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓ యాంకర్ ఈ ఇద్దరినీ పర్సనల్ గా సరదా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఫుడ్, ఏపీ ప్లేసెస్, సినిమాల గురించి అడిగింది.
ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా నారా లోకేష్.. అందరూ ఇష్టమే. కానీ చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫేవరేట్ హీరో. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా చూసాను. దానికి 4.5 రేటింగ్ ఇస్తాను అని అన్నారు.
Also Read : Karmastalam : అర్చన ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో ఆకాష్ పూరి.. మహిషాసురు మర్దినిపై సినిమా..
పుష్ప గురించి ప్రస్తావన రాగా.. అలాంటి సినిమాలు ఇప్పటి జనరేషన్ ని స్పాయిల్ చేస్తున్నాయి అన్నారు. అలాగే ఫుడ్ గురించి అడగ్గా.. ఉలవచారు బిర్యానీ బాగుంటుంది. నాకు ఉలవచారు అంటే ఇష్టం. ఏపీ ప్రజలు స్పైసి ప్రజలు. స్పైసి బాగా తింటారు అని అన్నారు. ఇక ఏపీ ప్లేసెస్ గురించి అడగ్గా ఏపీలో అరకు, శ్రీశైలంను అందరూ విజిట్ చేయాలి అని అన్నారు. దీంతో నారా లోకేష్ హీరోలు, సినిమాలు గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.