Chiranjeevi Parents : చిరు, పవన్.. మాత్రమే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సహాయం చేసారో తెలుసా..? చిరు ఏమన్నారంటే..
చిరంజీవి వాళ్ళ పేరెంట్స్ సహాయ గుణం గురించి తెలిపారు.

Chiranjeevi Interesting Comments on his Parents
Chiranjeevi Parents : మెగా ఫ్యామిలిలో చిరంజీవి నుంచి మొదలుపెట్టి చిన్న హీరోల వరకు అందరూ మరొకరికి సహాయంగానే ఉంటారు. ముఖ్యంగా అభిమానులకు, కష్టాల్లో ఉన్నవారికి ఏదో ఒక రకంగా ఆడుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంత మందికి సహాయం చేశారు అందరికి తెలిసిందే. చరణ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు.. ఇలా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేసిన వాళ్ళే. అయితే ఇదంతా చిరంజీవి వాళ్ళ పేరెంట్స్ నుంచే వచ్చింది అంటున్నారు.
నిన్న ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో మెగా వుమెన్ అని ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి వాళ్ళ పేరెంట్స్ సహాయ గుణం గురించి తెలిపారు.
Also Read : Anudeep – Suma : ‘అనుదీప్’ మళ్లొచ్చిండు.. సుమ షోలో ఈ సారి మరింత కామెడీ.. ప్రోమో వైరల్..
చిరంజీవి మాట్లాడుతూ.. ఒకరికి సపోర్ట్ గా ఉండటం, సాయం చేయడం మా అమ్మ నాన్న దగ్గర్నుంచి వచ్చింది. అమ్మ వాళ్ళ నాన్న 40+ ఏజ్ లోనే చనిపోయారు. తనకి ఓ తమ్ముడు, చెల్లెల్లు ఉన్నారు. అప్పుడు నాన్నే అమ్మ వాళ్ళ చెల్లెళ్లను చూసాడు. వాళ్లందరికీ సపోర్ట్ ఉన్నాడు. అమ్మ కూడా మా పెదనాన్న చనిపోతే వాళ్ళ పిల్లలకు చాలా సపోర్ట్ గా నిలిచింది. వాళ్ళ పెళ్లిళ్లు, పేరంటాలు అమ్మే చేసింది. వాళ్లకు ఇల్లు కొనిపెట్టింది. కొన్నాళ్ల పాటు కొంత డబ్బులు నెల నెలా కూడా వాళ్లకు పంపించింది అమ్మ. వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు అమ్మ ఎంతగానో సపోర్ట్ చేసింది. బంధాలు, బంధుత్వాలు ఎనలేని ఆస్తిపాస్తులు. డబ్బులు కూడా ఉండాలి. డబ్బులు ఉన్నా అందరితో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మనిషికి మనిషే తోడు ఉండాలి అని అన్నారు. దీంతో ఎప్పుడూ నెటిజన్లు ఇప్పుడు మెగా పేరెంట్స్ ని కూడా అభినందిస్తున్నారు.
Also Read : Dhee : కన్నప్ప వచ్చేముందు ‘ఢీ’ కొట్టబోతున్న మంచు విష్ణు.. ‘ఢీ’ రీ రిలీజ్ ఎప్పుడంటే..
మెగా ఫ్యామిలీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..