Anudeep – Suma : ‘అనుదీప్’ మళ్లొచ్చిండు.. సుమ షోలో ఈ సారి మరింత కామెడీ.. ప్రోమో వైరల్..
తాజాగా సుమ అడ్డా ప్రోమో రిలీజ్ చేశారు.

Jathi Ratnalu Movie Director Anudeep come again in Anchor Suma Show
Anudeep – Suma : జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తన సినిమాలతోనే కాదు బయట కూడా తన కామెడీతో మరింత వైరల్ అయ్యాడు. ముఖ్యంగా గతంలో యాంకర్ సుమ క్యాష్ షోకి అనుదీప్ వచ్చి ఫుల్ కామెడీ చేయడంతో బాగా వైరల్ అయ్యాడు. దీంతో అనుదీప్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఒక్కసారే అనుకుంటే రెండో సారి కూడా సుమ క్యాష్ షోకి వెళ్లి మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చాడు.
దీంతో అనుదీప్ కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ఆయన కామెడీ సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో బాగా వైరల్ అయింది. తాజాగా మరోసారి అనుదీప్ యాంకర్ సుమ షోకి వచ్చాడు. సుమ ప్రస్తుతం సుమ అడ్డా అనే షో చేస్తుంది. తాజాగా ఈ షోకి మ్యాడ్ స్క్వేర్ సినిమా మూవీ యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో అనుదీప్ కూడా చిన్న గెస్ట్ రోల్ చేసాడు. దీంతో ఈ టీమ్ తో అనుదీప్ కూడా సుమ అడ్డా షోకి వచ్చాడు.
తాజాగా సుమ అడ్డా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అనుదీప్ తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. దీంతో ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుదీప్ వచ్చిన ఈ ఫుల్ ఎపిసోడ్ మార్చ్ 16 ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. మీరు కూడా అనుదీప్ వచ్చిన సుమ అడ్డా ప్రోమో చూసేయండి..