×
Ad

Narendra Modi : అమెరికా పర్యటనలో ‘నాటు నాటు’ గురించి మోదీ వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

ఎన్నిరోజులు గడుస్తున్నా RRR, నాటు నాటు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వైట్ హౌస్ లో నాటు నాటు గురించి..

  • Published On : June 23, 2023 / 01:07 PM IST

Narendra Modi speech about naatu naatu at america white house

Narendra Modi – Naatu Naatu : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా తెరకెక్కిన RRR రిలీజ్ అయ్యి ఏడాది పైనే అవుతుంది. ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ (Oscar) గెలుచుకొని మూడు నెలలకు పైగా అవుతుంది. అయినాసరి వరల్డ్ వైడ్ గా ఎక్కడో ఒక చోట RRR గురించి నాటు నాటు గురించి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీని గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Pan India Movies : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా మూవీస్ హవా.. మూవీ లవర్స్‌కి పండగే..

ఇక ఈ పర్యటనలో మోదీ అమెరికా వైట్ హౌస్ లో అఫీషియల్ స్టేట్ డిన్నర్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. “రోజులు మారుతున్న కొద్దీ ఇండియన్స్ అండ్ అమెరికన్స్ ఒకరి జీవన శైలి గురించి ఒకరు బాగా తెలుసుకుంటున్నారు. ఇండియాలోని పిల్లలు హాలోవీన్ (Halloween) సమయంలో స్పైడర్ మ్యాన్ లా మారడానికి ఇష్టపడుతుంటే.. అమెరికాలోని యువత నాటు నాటు బీట్ కి స్టెప్పులు వేయడానికి ఇష్టపడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని RRR టీం రీ ట్వీట్ చేసింది.

BoyapatiRAPO : బోయపాటి రామ్ మాస్ కాంబో రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా నుంచి అవుట్.. అప్పుడే వచ్చేది..

“ఒకరి కల్చర్ గురించి మరొకరు తెలుసుకోవడం వారి మధ్య బలమైన బంధాన్ని పెంచుతుంది. మేము నమ్ముతున్నాము ఇండియా మరియు అమెరికా మధ్య అటువంటి బంధం అభివృద్ధి చెందుతుంది” అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా జులై 28న జపాన్‌ లో రిలీజ్ కాబోతుంది. గత ఏడాది అక్టోబర్ 21నే జపాన్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యినప్పటికీ అప్పుడు తెలుగు వెర్షన్ కి జపనీస్‌ సబ్‌ టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు జపనీస్‌ లాంగ్వేజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 200 రోజులు పైగా పూర్తి చేసుకొని 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.