Bigg Boss 15: దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు?
బిగ్ బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశంలోని చాలా బాషలలో పాపులర్ అయిన బిగ్ బాస్ షో హిందీలో మాత్రం..
- Naresh Mannam
- Published On : January 30, 2022 / 03:59 PM IST
Bigg Boss 15
Bigg Boss 15: బిగ్ బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశంలోని చాలా బాషలలో పాపులర్ అయిన బిగ్ బాస్ షో హిందీలో మాత్రం నాన్ స్టాప్ గా 15 సీజన్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తుంది. గత 11 సీజన్లుగా హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా ఉన్నాడు. దాదాపు నాలుగు నెలల భారీ టైం రన్ తర్వాత బిగ్ బాస్ 15 సీజన్ ఇప్పుడు ఫైనల్ కి చేరుకుంది.
NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?
ప్రతి సీజన్ మాదిరి.. దాదాపుగా అన్ని బాషల ఫార్మేట్ లా మాదిరే సాగిన ఈ సీజన్ లో ఫైనల్ విజేత ఎవరన్నది తేల్చేందుకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ అభిమాన కంటెస్టెంట్లను మద్దతుగా ఉంటూ వస్తుండగా ఫైనల్స్ కి సంబంధించి ఓటింగ్ లైన్ కూడా మూత పడింది. మరో 24 గంటల్లో విజేతను ప్రకటించాల్సి ఉండగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరన్నది ఆసక్తిగా అంతకి మించిన ఉత్కంఠగా మారింది.
Radhe Shyam: రాధేశ్యామ్ పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఇదే?
మొత్తం ఆరుగురు పోటీదారులతో మొదలైన ఈ సీజన్ ఫైనల్స్ శనివారం మొదలుకాగా శనివారమే ఒక కంటెస్టెంట్ బయటకి పంపడంతో ఇక ఐదుగురు మాత్రమే ఫైనల్ టైటిల్ పోరులో ఉన్నారు. ఫైనల్ గా షమితా శెట్టి, ప్రతీక్ సెహెజ్ పాల్, నిశాంత్ భట్, కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఈ సీజన్ టాప్ 5 ఫైనలిస్టులుగా ఉండగా వీరిలో టైటిల్ తో కోటికిపైగా నగదు గెలుచుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
