×
Ad

Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబో.. మిస్సైన డైరెక్టర్ తో నాని సినిమా

ది ప్యారడైజ్ సినిమా తరువాత క్రేజీ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న నాని(Nani).

Natural star nani doing his next movie with director venky atluri

Nani: నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. ఒకే తరహా సినిమాలు చేయడాన్ని ఆయన ఎప్పటికీ ఇష్టపడరు. అందుకే, సరిపోదా శనివారం లాంటి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత హాయ్ నాన్న లాంటి సాఫ్ట్ అండ్ ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. హాయ్ నాన్న తరువాత మళ్ళీ హిట్ 3 లాంటి వైలెంట్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలా ఏ పాత్రనైనా చేసి మెప్పించగల సత్తా ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు.

వారిలో నాని(Nani) ఒకరు. ప్రస్తుతం ఈ హీరో డిఫరెంట్ పాత్రలో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రెండు జెడలు వేసుకొని ‘జెడల్’ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో క్రేజీ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పేశాడట నాని. ఆ క్రేజీ దర్శకుడు మీరెవరో కాదు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా చేసి దర్శకుడిగా మెప్పించిన వెంకీ ఆతరువాత రెండు రొటీన్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.

Filmfare 2026: 70వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుక.. తెలుగు సినిమాల నామినేషన్స్ ఇవే

ఇక అక్కడినుంచి రూటు మార్చిన ఈ దర్శకుడు ఆ తరువాత ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ స్టార్ సూర్యతో విశ్వనాథమ్ అండ్ సన్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, వెంకీ అట్లూరి రీసెంట్ గా నానీని కలిసి ఒక కథ చెప్పాడట. అది నానికి బాగా నచ్చిందట. అందుకే, వెంటనే ఒకే చెప్పేశాడట.

నిజానికి, సార్ సినిమా కథను ముందుగా నానికే చెప్పాడట వెంకీ అట్లూరి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఒకే అవలేదు. ఆ ఛాన్స్ మిస్ అయ్యింది కాబట్టే మరోసారి సూపర్ డూపర్ కథతో నానిని మెప్పించాడట వెంకీ అట్లూరి. ది ప్యారడైజ్ తరువాత వెంటనే ఈ సినిమా చేస్తారా లేదా మధ్యలో వేరే సినిమా చేస్తాడా నాని అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కూడా సితార బ్యానర్ పై నాగ వంశీ నిర్మిచనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.