Filmfare 2026: 70వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుక.. తెలుగు సినిమాల నామినేషన్స్ ఇవే
ఫిలిం ఫేమ్ అవార్డ్స్ 2026(Filmfare 2026) తెలుగు నామినేషన్స్ లిస్ట్ విడుదల అయ్యింది.
Filmfare Awards 2026 telugu nominations list
Filmfare 2026; సౌత్ సినిమా ఇండస్ట్రీలు ఘనంగా జరుపుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్- 2026 అవార్డుల వేడుకకు కి రంగం సిద్ధం అయ్యాయంది. ఫిబ్రవరి 21న ఈ అవార్డుల వేడుకలు ఘనంగా జరుగనుంది. ఈ అవార్డుల(Filmfare 2026) కోసం తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. 2024లో విడుదలైన చిత్రాలకు గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. దీనికి సంబందించిన నామినేషన్స్ లిస్టును కూడా విడుదల చేశారు. వాటిలో తెలుగులో సినిమాల నామినేషన్స్ లిస్టు ఇక్కడ చూడొచ్చు.
ఉత్తమ చిత్రం:
- హనుమాన్
- కల్కి 2898 ఏడీ
- లక్కీ భాస్కర్
- పుష్ప : ది రూల్
- 35 చిన్న కథ కాదు
- కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ దర్శకుడు:
- సుకుమార్ (పుష్ప : ది రూల్)
- నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
- ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- నంద కిశోర్ (35 చిన్న కథ కాదు)
- యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు:
- ఎన్టీఆర్ (దేవర)
- అల్లు అర్జున్ (పుష్ప : ది రూల్)
- నాని (సరిపోదా శనివారం)
- తేజ సజ్జ (హనుమాన్)
- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
ఉత్తమ నటి:
- రష్మిక (పుష్ప : ది రూల్)
- అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)
- ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)
- ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)
- మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు:
- ఫహద్ ఫాజిల్ (పుష్ప : ది రూల్)
- అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
- ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
- వినయ్ రాయ్ (హనుమాన్)
- ధనంజయ్ (జీబ్రా)
- సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సహాయ నటి:
- వరలక్ష్మి శరత్‌కుమార్ (హనుమాన్)
- అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
- ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
- శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
- శ్రద్ధా శ్రీనాథ్ (మెకానిక్ రాకీ)
- రషి సింగ్ నందు (ప్రసన్నవదనం)
