Honey Review
Honey Review : నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాణంలో శేఖర్ స్టూడియోస్ సమర్పణలో కరుణకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హనీ సినిమా నేడు ఫిబ్రవరి 6న రిలీజ్ అయింది.(Honey Review)
ఆనంద్ (నవీన్ చంద్ర) కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో తాంత్రిక విద్యల వైపు ఆసక్తి చూపించి అవి నేర్చుకొని చేస్తూ ఉంటాడు. ఆఫీస్ లో తాంత్రిక పూజలు చేసాడు అనే నెపంతో కొట్టి జాబ్ లోంచి తీసేస్తారు. తన గురువు సారంగపాణి (రాజా రవీంద్ర)తో కలిసి ఆనంద్ పిల్లి మాయను విక్రయించాలి, ఏదో సాధించాలని క్షుద్రపూజలు లాంటివి మొదలుపెడతాడు. ఇందుకు ఒక పాప అవసరం రావడంతో తన భార్య లలిత (దివ్య పిళ్లై)ని బెదిరించి తన కూతురు మీరా(జయన్ని)ని ఈ పనికి ఎంచుకుంటాడు.
దీనివల్ల ఆనంద్ భార్య లలిత, కూతురు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళని ఊరికి దూరంగా ఓ ఇంటిలో బందీ కూడా చేస్తాడు. అసలు ఆ పిల్లి మాయ ఏంటి? దాంతో ఆనంద్ ఏం సాధించాలనుకున్నాడు? ఆనంద్ వల్ల అతని భార్య, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Sri Chidambaram Garu Review : ‘శ్రీ చిదంబరం గారు’ మూవీ రివ్యూ.. మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా..
క్షుద్ర పూజలు చేసే సీన్ తోనే కథ మొదలవుతుంది. ఆనంద్ పాత్రని చూపించిన విధానంతో బాగానే భయపెడతాడు అని భావిస్తాం. ఆనంద్ సారంగపాణితో కల్సిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఆనంద్ తన భార్య కూతురుని ఇబ్బంది పెట్టె సీన్స్ కాస్త ఎమోషనల్ చేస్తాయి. పిల్లి మాయని సేకరించాలి అని ఫస్ట్ హాఫ్ అంతా అదే సాగుతుంది. అయితే ఈ పిల్లి మాయ అనే కాన్సెప్ట్ కొత్తది అయినా కాసేపు థ్రిల్లింగ్ గా సాగినా ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. ఇదంతా డబ్బు కోసమే అని మొదట్లో చూపించినా దీనివల్ల ఏం వచ్చింది అనేది మాత్రం చూపించలేదు.
పాపని ఇబ్బంది పెట్టె సీన్స్ చూడటానికి కాస్త ఇబందికారంగా ఉంటాయి. దయ్యలతో హారర్ అని భయపెట్టకుండా తాంత్రిక, క్షుద్ర పూజలతో భయపెట్టే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ లో కాస్త బోర్ కొడుతుంది. ఇలాంటి సినిమాలో ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ సీన్స్ ఊహిస్తారు కానీ ఆశించినన్ని ఉండవు. క్లైమాక్స్ కూడా ముందే ఊహించేయొచ్చు. అక్కడక్కడా హారర్ తో మాత్రం భయపెట్టారు. ఈ సినిమా కేవలం పెద్దలకే ఎలాగూ A రేటింగ్ ఉంది. భయపడాలి, కాస్త థ్రిల్ ఫీల్ అవ్వాలంటే ఈ సినిమా చూడొచ్చు. మూఢ నమ్మకాలతో తన కుటుంబాన్నే నాశనం చేసుకొనే ఓ వ్యక్తి కథని థ్రిల్లర్ గా చూపించారు.
నవీన్ చంద్ర ఇప్పటికే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించాడు. హనీలో క్షుద్రపూజలు చేసే వ్యక్తిగా మరోసారి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. భార్య పాత్రలో దివ్య పిళ్ళై ఎమోషనల్ సీన్స్ తో మెప్పిస్తుంది. తన నటన చూసి మనకే పాపం అనిపిస్తుంది. కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించాయింది. రాజా రవీంద్ర, దివి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ కథకు తగ్గట్టు డార్క్ టోన్ లో విజువల్స్ ని చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగానే భయపెట్టారు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. డబ్బు కోసం తాంత్రిక పూజల్ని నమ్మి కుటుంబాన్ని నాశనం చేసుకునే కథాంశంతో దర్శకుడు హారర్ థ్రిల్లర్ గా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
మొత్తంగా ‘హనీ’ సినిమా అక్కడక్కడా భయపెట్టే క్షుద్ర, తాంత్రిక పూజలు ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.