×
Ad

Naveen : 50 ఏళ్ళ వయసులో నాన్న.. నరేష్ – పవిత్ర బంధంపై స్పందించిన కొడుకు.. ఏమన్నాడంటే..

తాజాగా నవీన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ పవిత్రతో కలిసి ఉండటంపై మాట్లాడాడు. (Naveen)

  • Published On : February 22, 2026 / 03:28 PM IST

Naveen Vijaya Krishna

Naveen : సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా ప్రకటించకపోయినా ప్రేమించుకున్నట్టు, వీరిద్దరూ కలిసి బతుకుతున్నట్టు వీరే ప్రకటించారు. పలు సినిమా ఈవెంట్స్ లో కూడా కలిసి కనిపించి సందడి చేస్తున్నారు ఈ జంట. తాజాగా నరేష్ – పవిత్ర బంధంపై నరేష్ కొడుకు కామెంట్స్ చేసాడు.

నరేష్ మొదటి భార్య కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా, నటుడిగా కొన్ని సినిమాలు చేసాడు. ప్రస్తుతం దర్శకత్వం ట్రయల్స్ లో ఉన్నాడు. తాజాగా నవీన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ పవిత్రతో కలిసి ఉండటంపై మాట్లాడాడు.

Also Read : NTR : మళ్ళీ ఆగిన ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్.. అక్కడ కూడా సమస్యే..

నవీన్ మాట్లాడుతూ.. పవిత్ర గారు చాలా మంచి మనిషి. ఆమెని పలుమార్లు కలిసాను. అందరిని ప్రేమగా పలకరిస్తుంది. అందరితో కలిసిపోతుంది. నాన్నకు ఆమె సరైన జోడి అని నా అభిప్రాయం. ఆమె ఉంటే నాన్న కూడా సైలెంట్ గా ఉంటారు. 50 ఏళ్ళ వయసులో నాన్న ప్రశాంతంగా అందటానికి ఆమె కారణం. ఇది మంచి విషయమే.

ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు అనడానికి ఇది నిదర్శనం.పవిత్ర గారితో నాన్న బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా ఒప్పుకున్నారు. పవిత్ర గారు వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అని అన్నాడు. నవీన్ కామెంట్స్ వైరల్ అవ్వగా తండ్రి ప్రేమని అర్ధం చేసుకున్న కొడుకు అని నవీన్ ని అభినందిస్తున్నారు.

Also Read : Toxic : టాక్సిక్ ఈవెంట్.. దిల్ రాజు బిగ్ ప్లాన్