Nayani Pavani : బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని గురించి తెలుసా?.. సోషల్ మీడియా సెన్సేషన్..
ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. వీరిలో నయని పావని..
- Saketh U
- Published On : October 9, 2023 / 08:03 AM IST
Nayani Pavani Entry in Bigg Boss 7 with Wild Card
Nayani Pavani : బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) తెలుగు అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం. అయితే ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.
Also Read : Bigg Boss 7 Day 35 : సరికొత్తగా బిగ్‌బాస్.. వైల్డ్ కార్డుతో ఏకంగా హౌస్‌లోకి అయిదుగురు ఎంట్రీ..
వీరిలో నయని పావని.. మొదట టిక్ టాక్ వీడియోలతో పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తెచ్చుకుంది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. పలు టీవీ షోలలో కూడా పాల్గొంది. శ్వేతా నాయుడుతో కలిసి డ్యాన్సులు వేస్తూ, కవర్ సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ అమ్మాయి అసలు పేరు సాయి పవన్ రాజు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్, క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఇంకా పెంచుకుంటుంది నయని పావని. మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
