Nayanthara : కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ఏకంగా 60 అడుగులు.. అమ్మవారి గెటప్‌లో నయనతార..
త్వరలో నయనతార మూకుతి అమ్మన్ 2 అనే సినిమాతో రాబోతుంది. (Nayanthara)
- Saketh U
- Published on- October 28, 2026 / 03:52 PM IST
Nayanthara
Nayanthara : నయనతారకు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో పాటు అదే రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్స్ కొడుతున్న హీరోయిన్ నయనతార. త్వరలో నయనతార మూకుతి అమ్మన్ 2 అనే సినిమాతో రాబోతుంది. తెలుగులో మహాశక్తి గా రాబోతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా కోసం నయనతార ఫ్యాన్స్ తాజాగా చెన్నైలోని వేల్స్ థియేటర్ బయట ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ ని పెట్టారు. నయనతార అమ్మవారి రూపంలో ఉన్న కటౌట్ ని ఏర్పాటు చేసారు. హీరోయిన్ కి ఇన్ని అడుగుల కటౌట్ ఇదే మొదటిసారి. దీంతో ఈ నయనతార 60 అడుగుల కటౌట్ వైరల్ గా మారింది. మొత్తానికి ఆమె ఫ్యాన్స్ కూడా మూకుతి అమ్మన్ 2 సినిమాకు ఇలా ప్రచారం కలిపిస్తున్నారు.
Also Read : Tamil Music Directors : అనిరుధ్ వర్సెస్ జీవీ ప్రకాష్.. తెలుగులో పోటీ పడుతున్న తమిళ సంగీత దర్శకులు..
నయన్ ఓ పక్క ఫ్యామిలీకి టైం ఇస్తూనే వరుసగా సినిమాలు చేస్తుంది. మూకుతి అమ్మన్ 2 తర్వాత రజనీకాంత్ ధర్మన్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ లేడీ సూపర్‌స్టార్. వీటితో పాటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా, తమిళ్ లో ఒక సినిమా చేస్తూ 41 ఏళ్ళ వయసులో కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.
