Nayanthara: ప్రియుడితో తిరుమలలో నయన్.. పెళ్లి పీటలెక్కుతారా?
ఇటు స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న నయనతార ఇప్పుడు ఒకవైపు భారీ ప్రాజెక్టులతో పాటు మరో వైపు ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ తో..
- Naresh Mannam
- Published On : September 27, 2021 / 01:37 PM IST
Nayanthara
Nayanthara: ఇటు స్టార్ హీరోల సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న నయనతార ఇప్పుడు ఒకవైపు భారీ ప్రాజెక్టులతో పాటు మరో వైపు ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ తో చెట్టాపట్టలేసుకొని యాత్రలతో కూడా బిజీగా ఉంది. నయన్ ప్రస్తుతం తమిళంలో రజనీ అన్నాత్తై, అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమాతో పాటు మరో నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో యాత్రలను కూడా కొనసాగిస్తుంది.
Nidhhi Agerwal: నో డౌట్.. ఇస్మార్ట్ అందాలకు దిమాక్ ఖరాబ్
నయనతార తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. వారిద్దరరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి ప్రత్యేక కానుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం పలికగా.. అనంతరం ఆలయ అధికారులు వారిని స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Dimple Hayati: డస్కీ అందాలతో మతులు చెడగొడుతున్న ‘ఖిలాడీ’!
నయన్ విగ్నేష్ శివన్ తో కొంతకాలంగా ప్రేమలో ఉండగా ఇటీవల ఓ రియాల్టీ షోలో నయన్ విగ్నేష్‌తో నిశ్చితార్థం అయిన విషయాన్ని బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. తమిళ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుండగా బర్త్ డేలు, పండగలు అంటూ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఇద్దరూ కలిసి యాత్రలకు చెక్కేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నా.. మీడియా నుండి ఎన్నిసార్లు పెళ్లెప్పుడనే ప్రశ్నలు వచ్చినా ఈ జంట మాత్రం టైముందని దాటవేస్తూ వస్తున్నారు. మరి ఈసారి తిరుమల వరకు వ్యవహారం వచ్చిందంటే ఆ మూడు ముళ్ల ఘడియలు త్వరలోనే ఉన్నాయని అనుకోవాలేమో!
#VikkyNayan 🙏🏻 pic.twitter.com/D2u3vqWk51
— Nayanthara✨ (@NayantharaU) September 27, 2021
