Nayanthara- Vignesh shivan: నయన్- విఘ్నేష్ తిరుమల యాత్ర.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నయనతార- విగ్నేష్ శివన్(Nayanthara- Vignesh shivan) దంపతులు.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 05:49 PM IST
Nayanthara and Vignesh Shivan Visit Tirumala
Nayanthara- Vignesh shivan: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు ఈ జంట. దర్శనం అనంతరం ఆలయ పండితులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. నయన్ దంపతులను చూడటానికి అభిమానులు ఎగబడటంతో తిరుమల పరిసరాల్లో సందడి నెలకొంది. వీరు కూడా చిరునవ్వుతో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.
విఘ్నేష్ శివన్(Nayanthara- Vignesh shivan) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) రేపు, అనగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ, చిత్ర యూనిట్ తరపున ఈ జంట శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. సినిమా ప్రచారంలో భాగంగా తిరుమల పర్యటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
