Sreeleela: నెలసరిని సాకు చెప్పకండి.. ఆ సమయంలో డాన్స్ కూడా చేశాను.. శ్రీలీల బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్
సమానత్వం కోరుకున్నప్పుడు మహిళలు నెలసరిని సాకుగా చెప్పకూడదు అంటూ శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలీల(Sreeleela.
Sreeleela Shocking Comments on Women Periods
- సమానత్వం కావాలంటే వెనకడుగు వేయొద్దు
- పీరియడ్స్ వివాదంపై శ్రీలీల క్లారిటీ
- శ్రీలీల వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇటీవల పీరియడ్స్ సమయంలో పని చేయడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆమె, తాను చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు తన నెలసరి సమయంలోనే చేశానని చెప్పింది. సమానత్వం కోరుకునే మహిళలు పీరియడ్స్‌ను ఒక సాకుగా చూపించి వెనకడుగు వేయకూడదని, శారీరక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Ram Gopal Varma: చావుకు దగ్గరయ్యాను.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్.. అసలు వర్మకు ఏమయ్యింది?
పురుషులతో సమానంగా హక్కులు కోరుతున్నప్పుడు ఇలాంటి సమయాల్లోనూ మనల్ని మనం ప్రోత్సహించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే శ్రీలీల(Sreeleela) చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వతహాగా డాక్టర్ అయిన శ్రీలీల, ప్రతి మహిళకు నెలసరి నొప్పి ఒకేలా ఉండదనే విషయాన్ని ఎలా మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. తీవ్రమైన నొప్పితో బాధపడేవారికి ఆమె మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయని, అది సాకు కాదని వారి ఆవేదన అని అంటున్నారు.
మరోవైపు, ఆమె ఉద్దేశం కేవలం స్ఫూర్తిని నింపడమేనని, పని పట్ల ఆమెకున్న నిబద్ధతను మెచ్చుకోవాలని మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే, శ్రీలీల ఇటీవల పవన్ కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
