×
Ad

Nayanthara : నయనతార ‘టాక్సిక్’ లుక్.. మరోసారి స్టైలిష్ గా..

చాన్నాళ్ల తర్వాత నయనతార ఒకప్పటి స్టైలిష్ లుక్స్ లో కనిపించింది.(Nayanthara)

Nayanthara

Nayanthara : నయనతార గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. ఇటీవలే మళ్ళీ కమర్షియల్ సినిమాల బాట పట్టింది. ఒకప్పుడు నయనతార అందాలు ఆరబోస్తూ, స్టైలిష్, హాట్ లుక్స్ లో చాలా సినిమాల్లో కనిపించి అలరించింది. చాన్నాళ్ల తర్వాత నయనతార ఒకప్పటి స్టైలిష్ లుక్స్ లో కనిపించింది.(Nayanthara)

నయనతార కన్నడ స్టార్ హీరో యశ్ టాక్సిక్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించి నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో నయనతార సరికొత్తగా స్టైలిష్ గా మోడరన్ డ్రెస్ లో కనిపించి వైరల్ అవుతుంది. ఈ ఫస్ట్ లుక్ చూసి ఇది నయనతారేనా అని ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ నయన్ తన పాత ఫార్మేట్ లోకి వెళ్లి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని మెప్పిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Trivikram Srinivas : నేను సినిమాలకు పనికి రానేమో.. మా అమ్మ ఒళ్ళో తల పెట్టి బాధపడ్డా.. త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్..

కేజీఎఫ్ తర్వాత కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అటు కన్నడతో పాటు ఇంగ్లీష్ లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కియారా అద్వానీ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పుడు నయనతార గంగ అనే పాత్రలో కనిపించబోతుంది అని ప్రకటించారు. ఇక ఈ సినిమా మార్చ్ 19న రిలీజ్ కానుంది.

Nayanthara

Also See : Trivikram : చాన్నాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన త్రివిక్రమ్.. నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ స్పెషల్ ఇంటర్వ్యూ..