Nayanthara: కవలలకు జన్మనిచ్చిన నయనతార..
ఈ దసరాకు చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార.. కవలలకు జన్మనిచ్చి ఫ్యాన్స్ కు మరో శుభవార్త చెప్పింది. నయన్ భర్త విఘ్నేష్ శివన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఇది నిజామా? ప్రాంక్? అనే తికమకలో పడ్డారు.
- gum 95921
- Published on- October 9, 2022 / 08:00 PM IST
Nayanthara Give Birth to Twins
Nayanthara: ఈ దసరాకు చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార.. కవలలకు జన్మనిచ్చి ఫ్యాన్స్ కు మరో శుభవార్త చెప్పింది. నయన్ భర్త విఘ్నేష్ శివన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఇది నిజామా? ప్రాంక్? అనే తికమకలో పడ్డారు.
Nayanthara: “గాడ్‌ఫాదర్”కు నయనతార నోటీసు..
నయనతార, నేను అమ్మానాన్నలు అయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదం అన్నీ కలిసి, మాకు ఇద్దరి బిడ్డల రూపంలో వచ్చాయి. మా “ఉయిర్ & ఉలగం” కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి” అని విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు. అలాగే నయన్ అండ్ శివన్ పిల్లల చిన్న పాదాలను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.
అయితే వీరిద్దరూ ఆరు సంవత్సరాల రిలేషన్ షిప్ తర్వాత జూన్ 9, 2022న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారని తెలుస్తుంది. ఏదేమైనా వారి అభిమానులు అయితే ఈ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు.
