Nayanthara : స్టేజిపై కౌగిలించుకున్న నయనతార.. ఏడ్చేసిన భర్త.. వీడియో వైరల్..

విగ్నేష్ మరింత ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. (Nayanthara)

  • Updated on- April 8, 2026 / 11:17 AM IST

Nayanthara

Nayanthara : నయనతార ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క విగ్నేష్ శివన్ తో పెళ్లి జీవితం హ్యాపీగా సాగిస్తుంది. ఇద్దరు పిల్లలతో, భర్తతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది నయన్. విగ్నేష్ శివన్ దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాని తెరకెక్కించారు. నయనతార నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకుడు విగ్నేష్ శివన్ మాట్లాడుతుండగా నయనతార సడెన్ గా స్టేజిపైకి వచ్చి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. స్టేజిపైకి నయన్ రావడంతో విగ్నేష్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో నయన్ తన భర్తని కౌగలించుకొని ఓదార్చింది. దీంతో విగ్నేష్ మరింత ఎమోషనల్ అయి ఏడ్చేశాడు.

Also Read : కూర్గ్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు.. రష్మిక సొంతూళ్లో విజయ్ కామెంట్స్ వైరల్..

ఇలా భార్య భర్తల బంధం స్టేజిపై చూపించడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. భర్తకి ఎమోషనల్ సపోర్ట్ గా నయనతార నిలబడిందని ఆమెని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. స్టేజిపై నయనతార భర్తని ఓదార్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.