Vijay Deverakonda : కూర్గ్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు.. రష్మిక సొంతూళ్లో విజయ్ కామెంట్స్ వైరల్..
ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Vijay Deverakonda)
Vijay Deverakonda Interesting Comments at Reception in Coorg
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నెల రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ పెళ్లి వేడుకలను ఒక రెండు వారాల పాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా మంగళవారం నాడు రష్మిక సొంతూరు కూర్గ్ జిల్లాలోని విరాజ్ పేట్ లో రిసెప్షన్ నిర్వహించారు. కొడవ సాంప్రదాయంలో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించారు.
ఈ రిసెప్షన్ కి రష్మిక బంధువులు, స్నేహితులు, అక్కడి లోకల్ ప్రజలు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : ఓటీటీ షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ తో కలిసి.. ఫోటోలు..
విజయ్ దేవరకొండ రష్మిక సొంతూళ్లో నిర్వహించిన రిసెప్షన్ లో మాట్లాడుతూ.. కూర్గ్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అని నేను రష్మికని కలిసే ముందే నమ్మాను. అలాంటి అందమైన అమ్మాయిల్లో నేను ఒకర్ని పెళ్లి చేసుకున్నాను. నేను మొదటిసారి కూర్గ్ కి స్కూల్ చదివే రోజుల్లోనే హాలిడే వెకేషన్ కి వచ్చాను. ఈ ప్లేస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తర్వాత మరోసారి వచ్చినప్పుడు ఇక్కడ నాకున్న ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉన్నాను. కానీ ఆ ఫ్రెండ్ ఇవాళ రిసెప్షన్ కి రాలేదు. ఇప్పుడు నేను మూడోసారి రావడం ఇది. ఇంకోసారి మళ్ళీ వచ్చి రష్మిక చిన్నప్పటి జ్ఞాపకాలను తిరిగి చూస్తాను ఇక్కడ అని అన్నారు.
Also Read : AAA.. అఖిల్, అల్లు అర్జున్, అకిరా నందన్.. ముగ్గురి బర్త్ డేలు ఇవాళే..
