మణిరత్నం దర్శకత్వంలో నయనతార!

  • Publish Date - April 6, 2019 / 06:10 AM IST

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా, మంచి నటిగా గుర్తింపుతెచ్చుకున్న అగ్రనటి నయనతార.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించబోతుంది. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియన్‌ సెల్వన్‌. దీన్ని ఇంతకుముందే నటుడు విజయ్, టాలీవుడ్‌ నటుడు మహేష్ బాబు, బాలీవుడ్‌ బ్యూటి ఐశ్వర్యరాయ్‌ వంటి వారితో తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. కానీ అప్పట్లో బడ్జెట్‌ తదితర విషయాలు సెట్‌ కాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని మణిరత్నం విరమించుకున్నారు. అయితే అది తాత్కాలికంగ మాత్రమే. ఇటీవల ఆయన అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌ విజయ్, జ్యోతిక వంటి స్టార్స్‌తో తెరకెక్కించిన సెక్క సివందవానం చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆయన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈసారి నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు మోహన్‌బాబు, ఐశ్వర్యరాయ్, కీర్తీసురేశ్‌ వంటి వారిని ఎంచుకున్నారు. అంతేకాదు మరో అగ్రనటి నయనతారను కూడా ఈ మల్టీస్టారర్‌ చిత్రంలోని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నయనతారకు ఎప్పటినుంచో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక.. ఈ విధంగా తీరుతుందని ఆమె తెలిపారు.