బాలయ్య దివాళీ ట్రీట్ రెడీ..

దీపావళి కానుకగా అక్టోబర్ 26 మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు NBK 105 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Publish Date - October 24, 2019 / 12:18 PM IST

దీపావళి కానుకగా అక్టోబర్ 26 మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు NBK 105 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

NBK 105 అప్ డేట్ కోసం నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానుల చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. NBK 105 అప్ డేట్ అక్టోబర్ 24న అని మూవీ టీమ్ అక్టోబర్ 23 సాయంత్రం ప్రకటించింది. టైమ్ చెప్పకుండా సస్పెన్స్ మెయింటెన్ చేయడంతో బాలయ్య అభిమానులు అక్టోబర్ 24వ తేదీ ఉదయం నుండే సోషల్ మీడియాకి అతుక్కుపోయారు.

సెకనుకోసారి రీ ఫ్రెష్ చేస్తూ.. అప్ డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేశారు. ఒకానొక దశలో ‘ఈ నిర్మాత ఇంతే’ అని అసహనానికి గురయ్యారు. అప్ డేట్ అని చెప్పిన 24 గంటలకు నిర్మాత అప్ డేట్ ఇచ్చాడు. అది కూడా అప్ డేట్‌కి అప్ డేట్ ఇవ్వడం విశేషం..

Read Also : ‘బాహుబలి’ కంటే ముందు ‘శివ’ : వర్మ సినిమాపై ప్రభాస్ కామెంట్

కట్ చేస్తే, NBK 105 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అక్టోబర్ 26 మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు అని చెప్పారు. ఇది చూసిన బాలయ్య అభిమానులు.. మొదట కోపం తెచ్చుకుని తర్వాత కంట్రోల్ చేసుకున్నారు. బాలయ్య దివాళీ ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..