NBK 111 Glimpse : బాలయ్య బాబు NBK 111 సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. బాలయ్య స్టైలిష్ అవతారం..

మీరు కూడా NBK 111 సినిమా గ్లింప్స్ చూసేయండి..(NBK 111 Glimpse)

  • Updated on- June 10, 2026 / 05:45 PM IST

NBK111 Glimpse

NBK 111 Glimpse : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలకృష్ణకు అఖండ 2 సినిమా ఫలితం కాస్త నిరాశ కలిగించింది. ఆ సినిమా తర్వాత బాలయ్య తన 111వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Pawan Kalyan : ఆ రెండు సినిమాలు నచ్చాయంటున్న పవన్ కళ్యాణ్.. నేషనల్ పాడ్ కాస్ట్ లో ఏం చెప్పారంటే..

ఈ సినిమా కథ 1993 ముంబై బ్యాక్ డ్రాప్ లో జరగబోతుందని తెలుస్తుంది. ఇందులో బాలయ్య అయితే సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించదు. గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ కి అయితే పండగే. మీరు కూడా NBK 111 సినిమా గ్లింప్స్ చూసేయండి..