Peddi Netflix: పెద్ది విషయంలో అలాంటివేం లెవ్.. తేల్చి చెప్పిన నెట్‌ఫ్లిక్స్
రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమా ఎప్పుడు విడుదలైనా తమకు ఒకే అంటున్న నెట్‌ఫ్లిక్స్.
- V Santhosh Kumar
- Updated on- April 14, 2026 / 03:10 PM IST
netflix giving no conditions for ram charan peddi movie
- పెద్ది సినిమా విషయంలో పాజిటీవ్ నెట్‌ఫ్లిక్స్
- రిలీజ్ ఎప్పుడైనా రేట్ తగ్గించేది లేదు
- రామ్ చరణ్, పెద్ది కంటెంట్ మీద ఉన్న నమ్మకమేనట
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. పాన్ ఇండియా లెవల్లో భారీగా వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రికార్డు స్థాయి ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సినిమాల విడుదల తేదీలు మారితే ఓటీటీ సంస్థలు అగ్రిమెంట్‌లలో మార్పులు చేసుకుంటాయి.
*ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో రాషా తడానీ.. క్రేజీ ఫోటోలు షేర్ చేసిన క్యూట్ బ్యూటీ
కానీ, ‘పెద్ది’ చిత్రం విషయంలో నెట్‌ఫ్లిక్స్ చాలా పాజిటీవ్ గా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉన్నా, ఒకవేళ వాయిదా పడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వాయిదా పడిందని భావించి డీల్ రేటును తగ్గించడం లేదా ఒప్పందాన్ని మార్చడం వంటి ఆలోచనలు ఆ సంస్థకు లేవట. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్, ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, విడుదల ఎప్పుడు జరిగినా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ వ్యూస్ రావడం ఖాయమని నెట్‌ఫ్లిక్స్ గట్టిగా నమ్ముతోంది. ప్రస్తుతం పెద్ది(Peddi) సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
