Ram Charan : రామ్ చరణ్‌ జాతీయ జెండాను అవమానించాడు.. నెటిజన్స్ ఫైర్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాతీయ జెండాను అవమానించారంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు..

Ram Charan

Ram Charan: భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులర్పిస్తూ భారతీయులందరూ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా ఇండియన్స్‌కి ఇండిపెండెన్స్ డే విషెస్ చెబుతున్నారు.

Ram Charan New Look : ఆచార్య ‘సిద్ధ’ న్యూ లుక్ అదిరిందిగా..!

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం జాతీయ జెండాను అవమానించారంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందంటే.. చరణ్ కొద్ది కాలంగా హ్యాపీ మెుబైల్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

Ram Charan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్లైపోద్ది’.. రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

స్వాత్యంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సదరు సంస్థ పేపర్ ప్రకటన ఇచ్చింది. అందులో చరణ్ జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లుంది. అయితే జెండా మధ్యలో అశోక చక్రం లేదు. దీంతో అశోక చక్రం లేకుండా నేషనల్ ఫ్లాగ్‌ను అవమానించారంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

దీంతో హ్యాపీ మొబైల్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను ఉపయోగించకూడదు. యాడ్స్ ఇచ్చేటప్పుడు జాతీయ జెండాలా ఉండే త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకే అశోక చక్రం లేకుండా ఉన్న జాతీయ జెండాను వాడాం. అంటూ సదరు సంస్థ క్లారిటీ ఇవ్వడంతో ట్రోల్సింగ్‌కి ఫుల్‌స్టాప్ పడింది.