×
Ad

Dhurandhar 2: ఓ పద్ధతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్.. దురంధర్ మేకర్స్ పై నెటిజన్స్ ప్రశంసలు

రిలీజ్ ప్లానింగ్ విషయంలో దురంధర్(Dhurandhar 2) మూవీ మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.

Netizens praising Dhurandhar movie producer and director

  • దురంధర్ మేకర్స్ పై నెటిజన్స్ ప్రశంసలు
  • ప్లానింగ్ అదుర్స్ అంటూ కామెంట్స్
  • సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Dhurandhar 2: బాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా విడుదలై సంచలనం క్రియేట్ చేసిన సినిమా దురంధర్. రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సాధించింది. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అది కూడా కేవలం హిందీ భాషలో విడుదలై ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు.

ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఒక రా ఏజెంట్ అక్కడి రహస్యాలను ఇండియాకు ఎలా చేరవేశారు అనే నిజ జీవితం సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమాలో రణవీర్ సింగ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను నటించాడు అనే కంటే ఆ పాత్రలో జీవించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దురంధర్ 2(Dhurandhar 2) వస్తున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor: తిరుమలలో జాన్వీ కపూర్.. పుట్టినరోజున ఫ్యామిలీతో స్పెషల్ ఫొటోస్

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదలకు సిద్ధం అయ్యింది. మొదటి పార్టుకు వచ్చిన భారీ రెస్పాన్స్ నేపధ్యంలో రెండో పార్ట్ ను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో, ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలు అనుకున్న డేట్ కి విడుదల కావడం లేదు. కానీ, దురంధర్ 1 అండ్ 2 సినిమాలు మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతున్నాయి. ఎలాంటి వాయిదాలు లేకుండా.

దాంతో, దురంధర్ మేకర్స్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దురంధర్ 1 అండ్ 2 సినిమాల షూటింగ్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. పార్ట్ 1 రిలీజ్ చేసిన కేవలం మూడు నెలల్లో రెండో పార్ట్ ను విడుదల చేస్తున్నారు. హైప్ భారీగా ఉన్నా ఎలాంటి హడావుడి లేదు. ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేయడం లేదు. టెక్నీకల్ ఇష్యు అని చెప్పి ట్రైలర్ ఆలస్యం చేయలేదు. రిలీజ్ కి పదిరోజుల ముందు బుకింగ్ ఓపెన్ చేశారు. ప్రీమియర్స్ తో కలిపి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్నా టికెట్ హైక్స్ లేవు. నార్మల్ రేట్స్ నే ఉంచారు. ఇది కదా ప్లానింగ్ అంటే, ఇది కదా పద్ధతి అంటే, ఇలా కదా సినిమాలను రిలీజ్ చేయాలి అంటూ నెటిజన్స్ దురంధర్ మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.