New Movie Opening : ఎస్.వి.కృష్ణారెడ్డి అతిధిగా కొత్త సినిమా ఓపెనింగ్..
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు.
- Saketh U
- Published on- May 12, 2026 / 06:32 AM IST
New Movie Opening
New Movie Opening : హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మాణంలో టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం రోజున ప్రారంభమైంది. అనురాగ్, సంతోష్, సాయి విక్రాంత్, అలీ, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఫణి గెస్టులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
Also Read : Krishna Reddy- Sandhya: పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు.. వేడుకగా ‘ముద్దమందారం’ ఫేమ్ కృష్ణారెడ్డి పెళ్లి
ఈ సందర్భంగా డైరెక్టర్ టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది. అలీ గారు ఓ కీలక పాత్రలో మెప్పించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం అని అన్నారు. నిర్మాతలు ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన వైవిధ్యమైన కథ నచ్చి సినిమా తీస్తున్నాం. ఇదే మా మొదటి సినిమా అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. విలక్షణమైన పాత్రతో ఆడియెన్స్‌ను మెప్పించబోతున్నాను అని అన్నారు.
