Speed 220 Trailer : స్పీడ్ 220 ట్రైలర్ రిలీజ్..
తాజాగా స్పీడ్ 220 ట్రైలర్ రిలీజ్ చేసారు.
- Saketh U
- Published On : August 20, 2024 / 02:47 PM IST
New Movie Speed 220 Trailer Released
Speed 220 Trailer : గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా స్పీడ్ 220. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్త నిర్మాణంలో హర్ష దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా స్పీడ్ 220 ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Vishwak Sen : మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన విశ్వక్ సేన్.. రెండు నెలలకే అయిపోయిందా..?
సీనియర్ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ లాంచ్ అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఆర్ఎక్స్100 సినిమా లాగా ఇది కూడా ఒక కొత్త కథ. డైరెక్టర్ దగ్గర మంచి ప్రతిభ ఉంది అని అన్నారు. స్పీడ్ 220 ట్రైలర్ చూసేయండి..
నిర్మాతలు మాట్లాడుతూ.. డైరెక్టర్ హర్ష మంచి కథ తీసుకొచ్చాడు. కథ వినగానే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యాము. ఈ సినిమాలో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికుల మధ్యన జరిగే సంఘర్షణ కళ్ళకి కట్టినట్టు డైరెక్టర్ చూపిస్తాడు అని అన్నారు. డైరెక్టర్ హర్ష బీజగం మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఆర్ఎక్స్ 100 లాగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఆగస్టు 23న ఈ స్పీడ్ 220 సినిమా రిలీజ్ కాబోతుంది అని తెలిపాడు.
