Vishwak Sen : మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన విశ్వక్ సేన్.. రెండు నెలలకే అయిపోయిందా..?

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.

Vishwak Sen : మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన విశ్వక్ సేన్.. రెండు నెలలకే అయిపోయిందా..?

Vishwak Sen Comeback to Social Media after Two Months

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతూ బిజీగానే ఉన్నాడు. త్వరలో దీపావళికి మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నించగా రీల్స్ ఎక్కువ చూస్తున్నాను, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నాను అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉందామని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు.

ఇది జరిగి రెండు నెలలు కూడా కాలేదు. జూన్ చివర్లో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు విశ్వక్ సేన్. నేడు విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఫోటో షేర్ చేసి.. నమస్తే అమ్మా అందరికి సర్వే జన సుఖినోభవంతు అంటూ రాసుకొచ్చాడు. మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చేసాను అని ఈ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసాడు విశ్వక్.

Also Read : NTR – Prashanth Neel : వాట్.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ మరీ అంతా? ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్..

అయితే సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయాను కొన్నాళ్ళు దూరంగా ఉంటాను అన్న విశ్వక్ పూర్తిగా రెండు నెలలు కూడా కాకముందే మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలోకి రావడంతో అప్పుడే మీ అడిక్షన్ తగ్గిపోయిందా, ఈ మాత్రం దానికే సోషల్ మీడియాకు దూరం, రీల్స్ కిఅడిక్షన్ అని చెప్పారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక విశ్వక్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)