NTR – Prashanth Neel : వాట్.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ మరీ అంతా? ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్..

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.

NTR – Prashanth Neel : వాట్.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ మరీ అంతా? ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్..

NTR Prashanth Neel Movie Budget Rumours goes Viral

NTR – Prashanth Neel :ఎన్టీఆర్ త్వరలో దసరాకు దేవర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమా షూట్ కూడా పూర్తయింది. దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ లోపే ఎన్టీఆర్ మరో కొత్త సినిమా మొదలుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమా ప్రశాంత్ నీల్ స్టైల్ లో ఫుల్ మాస్ గా ఉండబోతుందని తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.

Also Read : Prabhas – Sudheer Babu : ప్రభాస్‌ని తిట్టినందుకు.. అర్షద్ వార్సీకి కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు..

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు ఆల్మోస్ట్ దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఈ విషయం తెలిసి టాలీవుడ్ షాక్ అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది. దేవర సినిమాకు రెండు పార్టులకు కలిపి 250 కోట్లకు పైగా పెడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఎన్టీఆర్ – నీల్ ఒక్క సినిమాకే 350 కోట్లు అంటే ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ సినిమా అని ఫ్యాన్స్ సంతోషిస్తుంటే ఒక్క సినిమాకే అంతా పెడుతున్నారు, ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా? ఎన్టీఆర్ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవర సినిమా హిట్ అయి కనీసం 500 కోట్లు సాధిస్తే తప్ప నీల్ సినిమాపై అంచనాలు పెరిగి భారీ కలెక్షన్స్ రావు అంటున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.