Prabhas – Sudheer Babu : ప్రభాస్‌ని తిట్టినందుకు.. అర్షద్ వార్సీకి కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు..

ప్రభాస్ ని జోకర్ అని అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ పై ఫైర్ అవుతున్నారు.

Prabhas – Sudheer Babu : ప్రభాస్‌ని తిట్టినందుకు.. అర్షద్ వార్సీకి కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు..

Sudheer Babu Fires on Arshad Warsi for Comments on Prabhas

Updated On : August 20, 2024 / 12:32 PM IST

Prabhas – Sudheer Babu : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తూ కల్కి సినిమాలో జోకర్ లాగా కనిపించాడు అని అన్నాడు. దీంతో అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ ని జోకర్ అని అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ పై ఫైర్ అవుతున్నారు. నిన్నటినుంచి ఈ వార్త వైరల్ అవుతుంది.

Also Read : Rakhi Celebrations : మన సెలబ్రిటీల రాఖీ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో పోస్టులు.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ అజయ్ భూపతి, పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్ పై అర్షద్ చేసిన కామెంట్స్ కి ఘాటుగా స్పందించగా తాజాగా హీరో సుధీర్ బాబు సీరియస్ గా స్పందించాడు. సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో.. విమర్శలు తప్పుకాదు కానీ నోరు పారేసుకోవడం తప్పే. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్ వార్సీ నుంచి వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు చేసే కామెంట్స్ తాకలేని పెద్ద స్టాట్యూ లాంటివాడు ప్రభాస్ అని పోస్ట్ చేసాడు.

దీంతో సుధీర్ బాబు చేసిన పోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అర్షద్ తను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తాడా లేదా చూడాలి.