Theater Plus : అందుబాటులోకి వచ్చిన కొత్త ఓటీటీ.. ఫ్రీగా సినిమాలు..
ఈ వారం థియేటర్ ప్లస్ ఓటీటీలోకి రాబోతోన్నాయి. (Theater Plus)
- Saketh U
- Published on- September 30, 2026 / 04:25 PM IST
Theater Plus
Theater Plus : తాజాగా తెలుగులో మరో కొత్త ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే థియేటర్ ప్లస్ అనే ఓటీటీ మొదలుపెట్టారు. డిఫరెంట్ కంటెంట్, సినిమాల్ని ఈ ఓటీటీలో అందించనున్నారు. తాజాగా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీ లేకుండా ఉచితంగానే ఈ వారం మూడు సినిమాల్ని అందిస్తుంది ఈ ఓటీటీ. మూడు డిఫరెంట్ జానర్స్‌లో వచ్చిన గుమాస్తా, 4 వసంతాలు, జై గణేష్ అనే మలయాళం డబ్బింగ్ సినిమాలు ఈ వారం థియేటర్ ప్లస్ ఓటీటీలోకి రాబోతోన్నాయి.
Also Read : Bigg Boss Today Promo : కెప్టెన్సీ కోసం పోరు.. ఫైర్ & లావా.. సృష్టికి గాయాలు.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
గుమాస్తా సినిమా న్యాయ వ్వవస్థ, అందులోని లోపాల చుట్టూ తిరుగుతుంది. చట్టంలోని లూప్ హోల్స్ తెలిసిన లాయర్ క్లర్క్, అతని భార్య అనుమానాస్పద మృతిల చుట్టూ ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో సాగుతుంది. నాలుగు వసంతాలు అనేది ఓ అందమైన ప్రేమ కథ. నాలుగేళ్ల కాలేజ్ జర్నీలో ఓ ప్రేమ కథ, బ్రేకప్ వంటి అంశాల్ని చూపించబోతున్నారు. జై గణేష్ సినిమా ఓ చిన్న పిల్లాడి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా సాగుతుంది. త్వరలో ఈ ఓటీటీలో మరింత కంటెంట్ రానుంది.
