A new version of the OG movie is set to be released on OTT.
OG Ott: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ మేకర్స్ అదిరిపోతయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐటెం సాంగ్ ను యాడ్ చేసి కిక్ ఇచ్చిన టీం ఇప్పుడు ఇంకా సరికొత్తగా ఓజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. దీంతో ఓటీటీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. అయితే, దీపావళి సీజన్ వరకు ఓజీ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలై 10 రోజులు గడుస్తున్నా (OG Ott)ఆడియన్స్ ఇంకా ఈ సినిమా చూస్తూనే ఉన్నారు. క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఓజీ సినిమా సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఓజీ సినిమాను అక్టోబర్ ఎండింగ్ లోనే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనుంది. అయితే, ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఆడియన్స్ కి అదిరిపోతయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. అదేంటంటే. సెన్సార్ కోసం కట్ చేసిన దాదాపు 10 నిమిషాల ఫుటేజ్ నుయాడ్ చేయనున్నారట. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ కి సంబందించిన ఈ సన్నివేశాలు ఆడియన్స్ కి పూనకాలు తెప్పిస్తాయట. ఈ న్యూస్ తో ఓజీ సినిమా ఓటీటీ రిలీస్ పై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతోంది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ కి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఓజీ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే, మొదటిరోజు రూ.154 కొట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే బ్రేకీవెన్ కూడా సాధించింది ఈ సినిమా. దీంతో, రానున్న రోజుల్లో ఈ సినిమా బయ్యర్స్ కి లాభాలు తెచ్చిపెట్టనుంది.