Ustaad Bhagat Sing
Ustaad Bhagat Sing : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక వారం రోజులు ముందుకు వచ్చి మార్చ్ 19 రిలీజ్ కానుంది. మొదట్లో ఈ సినిమాపై అంత హైప్ లేకపోయినా ఇప్పుడు వరుసగా కంటెంట్ వదలడంతో అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ షాక్ అయ్యే న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ముందు రోజు రాత్రి, లేదా రిలీజ్ రోజు పొద్దున్నే ప్రీమియర్, బెనిఫిట్ షోలు వేస్తారు. దీనివల్ల సినిమా బాగుంటే ప్లస్ అవుతుంది, బాగోకపోతే సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది.
Also Read : Akanksha Singh: హాట్ ఫోజులతో హీట్ ఎక్కిస్తున్న ఆకాంక్ష సింగ్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ముందు రోజు ప్రీమియర్స్ వేయొద్దు అని నిర్మాతలను రిక్వెస్ట్ చేసారంట. అలాగే టికెట్ రేట్ల పెంపు సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టికెట్ రేట్లు కూడా 50 రూపాయల కంటే ఎక్కువ పెంచొద్దు, వర్కౌట్ అవ్వదు అని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ గట్టిగానే చెపుతున్నారట.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవనే తెలుస్తుంది. దీనిపై నిర్మాతలు అయితే అధికారికంగా ప్రకటించలేదు. ప్రీమియర్స్ షోలు ఉండవు అనే టాక్ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎలా జరుగుతుందో, టికెట్ రేట్లు ఎంత పెంచుతారో చూడాలి.
Also Read : Samantha: మహిళా దినోత్సవం సందర్బంగా.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సమంత