బుద్దుందా నీకు.. అదేం బర్త్‌డే కేక్?.. నియా శర్మను ఆటాడుకుంటున్న నెటిజన్స్..

  • Publish Date - September 19, 2020 / 11:22 AM IST

Nia Sharma 30th Birthday Celebration: మారుతున్న కాలంతో పాటు ప్రజలు అభిరుచులు, జీవన విధానం మారుతూనే ఉంటాయి.. ఈ విషయంలో సెలబ్రిటీల సంగతైతే చెప్పనవసరం లేదు. అయితే ఆ అభురుచి సోషల్ మీడియాకు ఎక్కితే, చూసే వారికి ఎబ్బెట్టుగా ఉంటే మాత్రం విమర్శలు తప్పవు. తాజాగా టీవీ సెలబ్రిటీ, నటి నియా శర్మ చేసిన పని ట్రోలింగ్‌కు గురవుతోంది. అసభ్య పదజాలంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.


ఇంతకీ నియా ఏం చేసిందంటే.. గురువారం తన 30వ జన్మదినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది నియా శర్మ. అయితే బర్త్‌డే కేక్ మాత్రం అసభ్యంగా ఉంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ను నియా శర్మ కట్ చేసింది. అంతటితో సరిపెట్టకుండా ఆ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకున్నారు. ఆమె ‘డర్టీ’ సెలబ్రేషన్స్‌కు అంతకంటే డర్టీగా బదులిచ్చారు. బుద్దుందా నీకు.. అదేం బర్త్‌డే కేక్ అంటూ ఆడేసుకుంటున్నారు.. 30వ పుట్టినరోజు తనకెంతో మెమరబుల్ అని.. ఫ్రెండ్స్ వల్లే చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పింది నియా అలియాస్ నేహా శర్మ..