Niharika – Anji : మెగాస్టార్ ‘అంజి’ సినిమాలో నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్.. కానీ..
నిహారిక తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట.
- Saketh U
- Published On : September 2, 2024 / 12:42 PM IST
Niharika Interesting Comments on Chiranjeevi Anji Movie
Niharika – Anji : మన సెలబ్రిటీల పిల్లలు చాలా మంది సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది అయితే చిన్నప్పట్నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. నాగబాబు కూతురు నిహారిక కూడా ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో సక్సెస్ కొట్టింది నిహారిక.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. నిహారిక తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట. మెగాస్టార్ క్లాసిక్ సినిమా ‘అంజి’లో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళల్లో ఒకరిగా నిహారిక నటించిందట. కానీ తర్వాత నిహారికని తీసేసి మళ్ళీ తన ప్లేస్ లోకి వేరే అమ్మాయిని తీసుకున్నారట.
Also Read : Bigg Boss Day 2 Promo : బిగ్ బాస్ డే 2 ప్రోమో.. అప్పుడే గొడవలు..
ఈ విషయాన్ని నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే నిహారికని అంజి సినిమా నుంచి ఎందుకు తీసేసారో మాత్రం చెప్పలేదు. ఇక అంజి సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఇప్పటికి బెస్ట్ క్లైమాక్స్, అప్పట్లో వచ్చిన బెస్ట్ విజువల్ సినిమాగా నిలిచింది.
