Niharika Konidela : గేమ్ సిరీస్‌తో రాబోతున్న నిహారిక కొణిదెల..
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ నిర్మిస్తూ సక్సెస్ లు అందుకుంటుంది. తాజాగా 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే గేమ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
- gum 95921
- Published On : March 22, 2023 / 05:21 PM IST
Niharika Konidela coming with new web series Dead Pixels
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సిల్వర్ స్క్రీన్ కంటే ముందు బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. అందరి స్టార్స్ కూతుళ్లులా హీరోయిన్ గా కాకుండా, ప్రముఖ డాన్స్ షోకి హోస్ట్ గా చేస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తరువాత నిర్మాతగా, నటిగా ఒకేసారి బాధ్యతలు తీసుకోని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక 2016 నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఒక మనసు’ సినిమాలో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై డెబ్యూట్ ఇచ్చింది.
Niharika Konidela : విడాకులు తీసుకోబోతున్న మరో మెగా జంట.. నిజమేనా?
ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ భాషల్లో కలిపి మెయిన్ లీడ్ లో మూడు సినిమాలో నటించింది. చిరంజీవి (Chiranjeevi) ‘సైరా’ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్ పైనే నిహారిక ద్రుష్టి పెట్టింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ (Oka Chinna Family Story), హలో వరల్డ్ (Hello World) సిరీస్‌కి.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి విజయాల్ని అందుకుంది. తాజాగా మరో వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈసారి మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తూ కనిపించబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఉగాది సందర్భంగా తన కొత్త మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ని అనౌన్స్ చేస్తూ ఒక ప్రోమో రిలీజ్ చేశారు.
Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..
ఈ క్రమంలోనే ‘డెడ్ పిక్సెల్’ (Dead Pixels) అనే సిరీస్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ లో నిహారిక కొణిదెల, వైవా హర్ష (Viva Harsha) తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ కి సంబంధించిన సపరేట్ ప్రోమో రిలీజ్ చేయనప్పటికీ హాట్‌స్టార్ ప్రోమో చూస్తే అర్ధమయ్యింది ఏంటంటే.. ఈ సిరీస్ ఇంగ్లీష్ ‘డెడ్ పిక్సెల్’ అడాప్టెడ్ వెర్షన్ గా రాబోతుంది అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో కొంతమంది ఆన్ లైన్ గేమ్ ఆడుతుంటారు. ఆ గేమ్ వాళ్ళ రియల్ లైఫ్ పై ఎటువంటి ప్రభావంలో చూపించింది అనేది కథ. ‘బ్లూ వేల్’ సూసైడ్ గేమ్ గురించి అందరు న్యూస్ లో వినే ఉంటారు. దాదాపు అదే కథాంశం ఈ సిరీస్ ఉండబోతుంది.
